సాహిత్యం వ్యాసాలు

ఆధునిక తెలుగు కవిత్వంలో భాష

రంగనాథాచార్యుల అభిప్రాయాలు ఇటీవల మనల్ని వదిలి వెళ్లిపోయిన కె.కె. రంగనాథాచార్యులు (కె.కె.ఆర్‌) ప్రగతిశీల తెలుగు సాహితీ మేధావుల్లో ఒక పెద్ద తల. వృత్తిరీత్యా ఆంధ్ర సారస్వత పరిషత్‌ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా, కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పని చేసినా, వృతినీ ప్రవృత్తినీ ఒకటిగా మలుచుకున్న నిరంతర అధ్యయన శీలి ఆయన. తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాషల్లో పండితుడు. తెలుగు శాసన భాషలో వచ్చిన మార్పులపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందిన భాషావేత్త. ఆధునిక కాలంలో తెలుగు సాహిత్య సాంస్కృతిక రంగాలలో వేగంగా ఒకదాని వెంట ఒకటిగా వస్తున్న మార్పులను ఒక కంట కనిపెడుతూ ఏక కాలంలో సాహిత్య బోధకుడుగా, సాహిత్య