(ఈ కథ ఆంధ్రప్రభ సచిత్రవార పత్రిక 10.4.74 సంచికలో అచ్చయింది. విరసం ప్రచురించిన చెరబండరాజు సాహిత్య సర్వస్వంలోని కథా సంపుటంలో ఇది చోటు చేసుకోలేదు. మిత్రుడు వంగల సంపత్‌రెడ్డి చెరబండరాజు సాహిత్యంపై తన పరిశోధనలో భాగంగా దీన్ని గుర్తించారు. శ్రీకాకుళం కథా నిలం నిర్వాహకులు దీన్ని పంపించారు. సంపత్‌రెడ్డికి, కథానిలయం నిర్వాహకులకు ధన్యవాదాలు.- వసంతమేఘం టీ) చేను చచ్చిపోయింది. కాలువ ఎండిపోయింది. చెరువు ఇంకిపోయింది. ఊళ్ళో కూలి జనం నాలుకల మీది తడి ఆరిపోయింది. వాళ్ళ ఎముకల్లో గలగల. కళ్ళలో గరగర. విరగ్గొట్టిన వేపకొమ్మల్లా ఎండిపోయి, కాలు పెడితే పటపటా విరిగిపోయే దశలో ఎవరి గూళ్ళలో కాళ్ళు, ఎవరి