వ్యాసాలు

మోదీ గ్యారంటీలతో మహిళా సాధికారత సాధ్యమా!

8 మార్చ్‌, అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం. 114 ఏళ్ల క్రితం ప్రపంచ కమ్యూనిస్టు నాయకుల చొరవ, కృషితో ప్రారంభమైన ఈ దినం ప్రపంచ వ్యాప్తంగా పీడిత వర్గాల మహిళలందరూ జరుపుకుంటున్నారు. వారందరికి అభినందనలు. వాస్తవంగా శ్రామిక మహిళలను మించి సంపన్న కుటుంబాల మహిళలు, కమ్యూనిస్టులను మించి బూర్జువా పార్టీలు ఈ దినాన్ని మరీ అట్టహసంగా జరుపుకోవడం యేటేటా పెరుగుతోంది. ఇందులో గత కొద్ది సంవత్సరాలుగా హిందుత్వ శక్తులు ముందు పీఠిన నిలుస్తున్నాయనడం అతిశయోక్తి కాదేమో! అధికారం రుచి మరిగిన హిందుత్వ శక్తులు, వారి తిరుగులేని నాయకుడు మోదీ తన అధికారాన్ని నిలుపుకోవడానికి దేనికైనా సిద్ధపడుతాడని, ఎంతకైనా తలపడుతాడని