దండకారణ్య విప్లవోద్యమంలో నాలుగు దశాబ్దాలు అలుపెరుగని, మడిమ తిప్పని గొప్ప విప్లవ కారుడు, ప్రజల ముద్దు బిడ్డ శంకరన్న. ఆయన 1960లలో సిరొంచ తాలూకాలోని అంకీస-ఆసరెల్లిలకు సమీపంలో కల సాతాన్ పల్లిలో నిరుపేద ఆదివాసీ వాసం వారి కుటుంబంలో పుట్టాడు. ఆయనకు తల్లి-తండ్రులు శివా అని పేరు పెట్టుకున్నారు. ఆయన వాసం శివా గానే పెరిగాడు. అందరాదివాసీ పిల్లల లాగే ఆయన చదువు సంధ్యలు నోచుకోలేదు. చదువుకోవాలనే కోరిక ఎంతున్నా పేదరికం అనుమతించలేదు. ఆయన నవ యవ్వన ప్రాయంలోనే విప్లవ రాజకీయాల ప్రభావంలోకి వచ్చి అనతికాలంలోనే పూర్తికాలం విప్లవకారుడిగా విప్లవోద్యమంలో చేరిపోయాడు. గడ్ చిరోలీ జిల్లాలో ఉద్యమంలో చేరిన