కవిత్వం

నాగరికత గుండెలమీద చావుపాట

ఆక్సిజన్ అందకఇప్పటికే చాలానదులు చచ్చిపోయాయి అదేమిటోగానిమృతజలాలలోతేలియాడే తమశవాల్నిఎవరూ పట్టించుకోలేదు నదులగోసల్ని ఎవరైనా విన్నారాఊపిరాడకఎంతెంత నరకయాతన అనుభవించాయో తెల్సుకున్నారామనకు ప్రాణప్రదమైనమనకు బతుకునిచ్చిననదులిప్పుడుపారే శవాలు***మృతనదుల్లోశవాల్ని విడిచేస్తేచేసిన నేరాలు కొట్టకుపోతాయానదులమీదుగాతేలియాడే శవాల్లాగేనేరాలు సైతంకాలంనదిమీద తేలుతూ ఉంటాయ్ ఏదో ఒకరోజునఅన్ని నదులూఆక్సిజన్ అందకఊపిరాగి చచ్చిపోతాయిఆపుడా మృతనదుల మీదుగానాగరికతల అస్థిపంజరాలుతేలియాడుతూ పోయిచీకటి సముద్రంలో కల్సిపోతాయ్ నదులకుతామెప్పుడు చచ్చిపోతామో తెల్సుఆ వెంటే నాగరికత కూడా… (  జసింతా కెర్ కెట్టా (ఆదివాసి యువతి ) గారికవితకు       స్వేచ్ఛానువాదం......ఉదయమిత్ర )