వ్యాసాలు

ఎవరిపై పోరాడుతున్నారో తెలుసుకోండి

పోలీసు, అర్ధ సైనిక, సైనిక జవాన్ లారా! భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) గత 50 సంవత్సరాలకు పైగా మన దేశంలో విప్లవోద్యమాన్ని నిర్మిస్తోంది. భారత విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి మిమ్మల్ని పెద్ద సంఖ్యలో పాలకులు మోహరిస్తున్నారు. ఇప్పటికే దేశానికి ఉత్తరాన కశ్మీర్ లో, ఈశాన్యాన అసోం నుండి అరుణాచల్ ప్రదేశ్ ల వరకు లక్షల సంఖ్యలో మిమ్మల్ని మోహరించారు. మధ్య, తూర్పు భారత రాష్ట్రాలలో మీరు ఆరు లక్షలకు పైగానే మోహరించబడి ఉన్నారు. ఇటీవల 2019 డిసెంబర్ లో జాతీయ భద్రతా సలహాదారు విజయకుమార్ నాయకత్వంలో జరిగిన ఐదు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో నూతనంగా విప్లవోద్యమం నిర్మూలనకు