వ్యాసాలు

నిర్ధాక్షిణ్యమైన కార్పొరేటీకరణ, హైందవీకరణ ఫలితం మణిపుర్ విధ్వంసం. 

అమానవీయ మనువాద పర్యవసానం మహిళల నగ్నప్రదర్శన మణిపుర్ లోని కాంగ్పోక్పి జిల్లాలో ఇద్దరు మహిళల నగ్న ప్రదర్శన, వారిలో 21 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం దేశాన్ని కుదిపివేసింది. ఆమె 56 ఏళ్ల తండ్రిని, 19 ఏళ్ల సోదరున్ని కాల్చి చంపి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ప్రదర్శనను చూపుతూ 26 సెకన్ల వీడియో వైరల్ కావడంతో మణిపుర్ లో మనువాదం ఎలా బుసలు కొడుతుందో వెల్లడైంది. యావద్దేశవాసులు ఆ దారుణానికి చలించిపోయారు. విదేశీయులు సైతం నిర్ఘాంతపోయారు. ‘‘కనిపిస్తే కాల్చివేత’’ ఆదేశాలు, 10 వేల మంది అదనపు భారత సైన్యాల మొహరింపు మధ్య ఈ దారుణం జరిగింది. దేశంలోని