గోమియా, నవాదీయ్ ఆదివాసుల గురించి ఆలోచిద్దాం జార్ఖండ్ జనాధికార మహాసభ తన సహచర సంస్థలు (ఆదివాసి , మూలవాసి సంఘటన్, బోకారీ, ఆదివాసి ఉమెన్స్ నెట్వర్క్, బగైచా తదితర సంస్థలు) కలిసి ఆగస్ట్ 2021- జనవరి 2022 మధ్యకాలంలో బోకారీ జిల్లా గోమియా & నవాదీయ్ డివిజన్ పరిధిలో (బ్లాక్లో) అమాయకులైన, నిర్దోషులు ఆదివాసీలు, నిర్వాసితులు మావోయిస్టులని, ఇతర తప్పుడు ఆరోపణపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన ఘటనపై నిజనిర్ధారణ కమిటీ విచారణ చేసింది. దాదాపు 31 మంది పీడిత కుటుంబాలను, బాధితులను విచారణ చేసింది. ఈ నిజనిర్ధారణ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే బాధితుల పరిస్థితులను అర్థం చేసుకోవడం,