కవిత్వం

కలలతో పయనించే కాలం రాలేదింకా

మనసు మత్తడి పోస్తున్నది కలలను కానీ మనసుకు ఆవల పని చాలా మిగిలున్నది నేస్తం! ఇంకా కొన్ని దేహాలపై కాంక్షలు దాడులు చేస్తున్నవి! ఇంకా కొన్ని నేరాలకై ప్రజాస్వామ్య పావురం గొడుగు పడుతున్నది! ఇంకా పార్లమెంటు అసెంబ్లీ భవనాలు ఏదో అంటరానితనాన్ని పాటిస్తున్నవి! ఇంకా ఓ ఆడకూతురు పెందలకడనే మరణిస్తున్నది ఇంకా విద్య పౌష్టికాహార లోపంతో జబ్బుపడి తల్లడిల్లుతున్నది! ఇంకా ఓ సంచారి సాయంకాలానికి ఓ చెట్టును, ఓ ముద్దను అర్థిస్తున్నాడు! ఇంకా నగరం రోజుకో బిచ్చగాణ్ణి అపస్మారక స్థితికి చేరుస్తున్నది! ఇంకా పల్లె దేహం వలసలతో సలసల కాగుతూనే ఉంది! ఇంకా ఈ స్వరాజ్యం బానిసత్వపు అవార్డులు