కా.రా కధల్లో తొలిదశ కథలన్నీ కొ. కు. ప్రభావంలో వచ్చిన కథలు.బ్రాహ్మణ మధ్య తరగతి మానవ సంబంధాల్ని ట్రీట్ చేసిన కథలివి.అందులో కారా సొంతతనం కనిపించదు.మలి దశ కథల్లోనే కా.రా తనం కనిపించేది. ఇందులో వీరుడు- మహా వీరుడూ, శాంతి,కుట్ర, భయం,తీర్పు జీవితం తాలూకు మార్క్సిస్టు ఆర్ధిక రాజకీయ నైతిక పాఠాల్లాంటివి. ఆర్తి, చావు, నో రూమ్,యజ్ఞం, మరి కొన్ని కధల్లో కుల వాస్తవికతను కేంద్రీకరించి రాశాడు.ఇందులో యజ్ఞం, నోరూమ్ కధల్లో తప్ప మిగతా కధలన్నింటిలోనూ ఆనాటి మార్క్సిస్టు ఆర్ధిక నిర్ణాయక కోణం నుంచి కుల సమస్య ను చూపుతాడు. 'ఆర్తి' కథలో దళితుల్ని ఆర్ధిక పీడితులుగా తప్ప