వ్యాసాలు

వీరమాత కామ్రేడ్‌ అనసూయమ్మకు నివాళి!

అనసూయమ్మ 2022, జనవరి 30న తన 97వ యేట హైదరాబాద్‌లో మృతిచెందారు. ఆమె మావోయిస్టు నాయ‌కుడు   అమరుడు కామ్రేడ్‌ సంతోష్‌ (మహేష్‌)కు కన్నతల్లి. దండ‌కార‌ణ్య సాహిత్య సాంస్కృతికోద్య‌మ ప‌త్రిక 'రుంకార్ అమెకు తలవంచి వినమ్ర శ్రద్దాంజలి అర్చిస్తున్నది. ఆమె బంధు మిత్రులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నది. అనసూయమ్మ దాదాపు 80 యేళ్ల క్రితం ఎర్రంరెడ్డి లక్ష్మారెడ్డి స‌హ‌చ‌రిగా వర్తమాన జనగామ జిల్లా కడవెండిలో అడుగుపెట్టింది. విసునూరు దొరలతో వీరంగమాడి, కరడుగట్టిన భూస్వామ్యానికి బీటలుబార్చిన తెలంగాణ సాయుధ పోరాటానికి దొడ్డి కొమురయ్య అమరత్వం రూపంలో తొలిత్యాగాన్ని అందించిన గ్రామంగా కడవెండి తెలంగాణ చరిత్రలో చెరిగిపోని ముద్రవేసుకుంది. పుట్టిన వర్గం, ముఖ్యంగా