కవిత్వం

ఉంటాం, అంతే

బతికున్న చావులు లెక్క కట్టడం ఎవరికీ సాధ్యం కాదు మానసిక మరణాలకు ప్రభుత్వం ఎన్నటికీ దోషి కాదు రాజ్యం తన పని తాను చేసుకపోతోంది అడ్డుతగలకండి దరాఘాతానికి వంటిల్లు మూర్చిల్లింది సర్కారును ఎవరూ నిందిచకండి వారు భక్తిరసంలో మునిగి ఉన్నారు పూజా ద్రవ్యాల రేట్లు తగ్గించండి పస్తులుండైనా భజనలు చేస్తాం రెండు పూట్ల భోజనాలను రద్దు చేసుకుంటాం ఒకపూట తిని ఓటు కోసం బతికుంటాం మీరు శూలాలు విల్లంబులు గదలు మేము ఆయుధాలను మోసే బంటులం ఏ అబద్దాలనైనా దృశ్యకావ్యాలుగా మలిస్తే మేము శవాలుగా చప్పట్లు కొడతాం మా పిల్లలకు ప్రేమ స్నేహం దయ పదాలను పలకపై దిద్దించడం