వ్యాసాలు

నిబద్ధ విమర్శకుడు కెవిఆర్

కెవిఆర్‍గా నిలిచి పోగోరిన కనుపూరు వెంకట రమణారెడ్డి కవి, విమర్శకుడు, నాటక కర్త, విరసం వ్యవస్థాపక కార్యదర్శి, పత్రికా సంపాదకుడు, అధ్యాపకుడు. మార్క్సిస్టు దృక్పద భూమికతో ఒక రచనను రచయితని అంచనా వేసే పద్ధతికి కె.వి.ఆర్ రచనలన్నీ తార్కానాలుగా నిలుస్తాయి . తెలుగులో వ్యాసం రాసినా, గ్రంథం రాసి నా, ఒక రచన వెలువడిన కాలం దాని ముందు వెనుకలు, సామాజిక ఆర్థిక రాజకీయ సాహిత్య పరిణామాలు, రచయిత దృక్పథం ,సాహిత్య తత్వం వంటి అంశాలతో ముడిపెట్టి సమగ్ర దృష్టితో విమర్శ చేసిన వారు కెవిఆర్. మహోదయం, కవి కోకిల, జగన్నాథ రథచక్రాలు, ఆధునికాంధ్ర సాహిత్య చరిత్ర వంటివి