సమీక్షలు

అంతర్జాతీయ రియలిస్టిక్ సినిమా

 “విభిన్న భాషల, జాతుల ప్రజలను చైతన్య పరచడానికి సినిమాను మించిన కళారూపం మరొకటి లేదు “ అన్న లెనిన్ అభిప్రాయానికి అనువుగా వివిధ  ప్రాంతాలకు చెందిన 29 సమాంతర, ప్రత్యామ్నాయ సినిమాల గురించి ఎంతో ప్రేమతో, గొప్ప అవగాహనతో, ఒక మంచి అభిరుచితో, ఒక ప్రత్యేకమైన లోచూపుతో, రచయిత్రి శివలక్ష్మి గారు  పంచుతున్నసినీ  విజ్ఞాన చంద్రికలు  ఈ అంతర్జాతీయ సినిమాల గురించిన వ్యాసాలు. మాతృక, మహిళా మార్గం, అరుణ తార పత్రికలు; విహంగ, సారంగ, కొలిమి, వసంత మేఘం వంటి  అంతర్జాల పత్రికలలో  ప్రచురించిన సినీ సమీక్షల సంకలనం ఈ పుస్తకం. విఖ్యాత రచయిత  వరవరరావు గారు సినిమాలలో