సమీక్షలు

ఆకాశ మార్గాన్ని గురి చూస్తున్నవిల్లంబులు

కొండల మీద, గుట్టల మీద, నదుల పక్కన జీవించే దండకారణ్య ఆదివాసులు ఎప్పుడైనా ఇలాంటి పోరాటం చేయాల్సి వస్తుందని కలగని ఉంటారా?  ప్రకృతి పరివ్యాప్త సాంస్కృతిక జగత్తులో ఓలలాడే ఆదివాసులు ఆకాశ యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకొని ఉంటారా? ఊహా తీరాల వెంట గొప్ప కాల్పనిక భావావేశంతో కళల ఊటను ప్రవహింపచేసే ఆదివాసులు ఇలాంటి ప్రతి వ్యూహ రచన ఎన్నడైనా చేసి ఉంటారా? వందల వేళ ఏళ్ల నుంచి రాజ్య ధిక్కారమే జీవన విధానంగా సాగిన ఆదివాసులు ఆకాశ మార్గాన యుద్ధం చేసే రాజ్యం ఒకటి  తమ మీద ఇలా విరుచుకపడి బాంబుల దాడి చేస్తుందని తలపోసి ఉంటారా?