వ్యాసాలు

రాజ్యాంగ ఆరాధనలో స్పష్టంగా కనిపించని చిత్రం

ఏదైనా ఒక రచనను, లేదా సిద్ధాంత ప్రతిపాదనను అంచనా వేసే సమయంలో దాని చారిత్రక సందర్భాన్ని చూడాలి. ఆరాధనా భావంతో కాకుండా విమర్శనాత్మకంగా చూడాలి. ఆ వ్యాసానికున్న స్పిరిట్‌ అవగాహన చేసుకోవాలి. మొత్తానికి ఆ సిద్ధాంత ప్రతిపాదన  ప్రస్తుత సమాజంలోని వైరుధ్యాల్ని ఎట్లా చూస్తున్నది, అవి పరిష్కారం కావడానికి ఉన్న ఆటంకాలుగా వేటిని భావిస్తున్నది, వాటి మీద ఎటాంటి విమర్శనాత్మక వైఖరిని ప్రకటిస్తున్నది అని చూడాలి.  జనవరి 27, 28 తేదీల్లో విరసం సభలో పి.వరలక్ష్మి ఇచ్చిన కీ నోట్‌ ప్రసంగాన్ని పై నేపథ్యంలో అర్థం చేసుకోవడంలో చాలా మంది విఫలమయ్యారు. ఆ కీనోట్‌ మొత్తం ఫ్రేం వర్క్‌ను