రాయలసీమ విద్యా పరిరక్షణ కమిటీ, అమ్మకు తిండి పెట్టలేదు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు కొనిపెడతానని చెప్పాడంట వెనకటికి ఒక ప్రబుద్ధుడు. కర్నూలు జిల్లాలో రాయలసీమ విశ్వవిద్యాలయం, ఐఐటిడిఎం, ఆంధ్ర ప్రదేశ్ ఉర్దూ విశ్వ విద్యాలయం ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి అనే సంగతి పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా జగన్నాథ గట్టు దగ్గర క్లస్టర్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. 2008 లో 16 విభాగాలతో ఏర్పడ్డ రాయలసీమ విశ్వ విద్యాలయం పట్టుమని పది మంది అధ్యాపకులు లేక కీలక విభాగాలు మూసివేతకు గురైనాయి. అమెరికాలో ఒక ప్రభుత్వం గద్దె దిగగానే ప్రభుత్వంలో ఉన్న సెక్రెట్రీలు కూడా అధికారం