కవిత్వం

తెలుగు వెంకటేష్ ఐదు కవితలు

మణిపూర్ దుఃఖం 1 ఈ నొప్పికి బాధ ఉంది మనుషులమేనా మనమసలు ఈశాన్య మహిళలు మనకు ఏమీకారా భారత మాత విగ్రహానికి మువ్వన్నెల చీర కట్టి మురిసిపోయే మనం ఇపుడు ఏమి మాట్లాడాలి నగ్నంగా ఊరేగించి అత్యాచార హింసను అమ్మలపై చేస్తోన్న రాజకీయ అంగాలు చెద పట్టవా ఆకుల్ని రాల్చినట్టు ప్రాణాల్ని మంటల్లో విసిరే కిరాతక హంతకుల్ని ఎన్ని వందలసార్లు ఉరి తీయాలి కసాయి హింసకు మన నిశ్శబ్దం తరాల ధృతరాష్ట్ర మౌనమేనా పూలను ప్రేమించని ఈ రాతి మనుషులకు నొప్పి గురించి ఎవరు పాఠాలు చెబుతారు ఈ ముళ్ళచెట్లను నడిమికి విరిచే కొడవళ్లు ఎపుడు మొలుస్తాయి ఒక
కవిత్వం

అనిశ్చయం

రాత్రి నేను ప్రార్ధించేసమయంలో తోడెళ్ళు యోనిని గాయపరుస్తాయి లాఠీ చేయకూడని తప్పు చేస్తుంది వైద్యం కరెన్సీ పడక మీద నిద్దురపోతుంది ఆకలి బాధ గడ్డకట్టుకపోయి నిశ్చలమవుతుంది అప్పులనీడ ఊరితాడై కుటుంబాన్ని జనాభా లెక్కల నుంచి వేరుచేస్తుంది పేద , మధ్యతరగతి మనుషులు సగం రాత్రి చచ్చి మిగతా సగం పగలు చావడానికి దేహాల్ని దాచుకుంటారు భద్రత లేని లోకంలో పండుముఖాలు నిరాశ శూన్యాలై లోలోన గొణుక్కుంటూ ఉంటాయి ఎక్కడో పసినిద్ర ఉలిక్కిపడుతుంది భ్రమల్లో బతుకుతోన్న ఆశలు కోడినిద్దురతో కుస్తీ పడుతుంటాయి.