వ్యాసాలు

సంక్షేమ హస్టల్ విద్యార్థులు భవ్య, వైష్ణవీలకు న్యాయం దక్కేనా ?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగామొత్తం 3,214 యస్సీ, యస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు,సంక్షేమ హాస్టళ్లలో 8,59,959 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.ఇటీవల కాలంలో సంక్షేమ వసతి గృహాలు,గురుకులాలలో బాలికల వరస మరణాలు కొనసాగుతున్నాయి.హౕస్టళ్ళలో పర్యవేక్షణ లోపం,సౌకర్యాల కొరత, పౌష్టికాహారం అందకపోవడం వంటి కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నప్పటికీ    “కుల వివక్షత” అసలు కారణం. ఈ ఏడాది పిబ్రవరీ మూడవతేది రాత్రి భువనగిరి పట్టణంలోని యస్సీ బాలికల వసతిగృహంలో పదవతరగతి చదివే విద్యార్థులు కోడి భవ్య (15), గాదే వైష్ణవి(15) ఆత్మహత్యలు చేసుకున్నారు. బాలికల హాస్టల్ వద్ద హాస్టల్ వార్డెన్ ,వాచ్ వుమెన్ ఉండకపోవడం హాస్టల్లో ఉన్న వంట మనిషి ఆమెతో పాటు హౕస్టల్