సాహిత్యం కవిత్వం

రగల్ జెండను భుజానికెత్తి జోహార్లందాం..!!

ఇది యుద్ధంఅనుకున్నాక..గెలుపొక్కటేలక్షమనుకున్నాక.. నువ్వూ నేనూఅతడూ ఆమెప్రజా యుద్ధానికిమారు పేరులం కదా.. జన సంగ్రామానికిజవసత్వాలౌతూజననమే కానీఎవరికైనా మరణమెక్కడిదీ.. అడవినీ మైదాల్నీకన్నీటి సంద్రాల్నీఅలుపెరుగని అమ్మవడైఆలింగనం చేసుకున్నవాడు అయిన వాళ్ళందరినీకష్టజీవి కన్నీళ్ళలోఆ బతుకు గాయాల్లోదర్శించుకున్న దార్శికుడతడు.. ఏవూరూ ఏవాడాఎవరి బిడ్డాఏవొక్కరి స్వప్నమదీఅతడికి మరణమెక్కడిదీ.. అతడి సహచర్యంలోఆయుధమూ అక్షరాలు దిద్దిచెరచబడ్డ చెల్లెళ్ళపిడికిళ్ళై విరబూయాలనిపరితపించింది.. పారే చెలిమతరాల దూపతో అల్లాడేఆదివాసీ గొంతు తడిపేకర్తవ్యాన్ని కళ్ళకద్దుకున్నది.. ఆ చెట్టూ ఈ పుట్టావాగూ వంకా పూవూ పిందేసెంట్రీ గాసిన తీతువూదాపుగాసిన గుబురు పొదలూ దుఖ్ఖ నదుల నదిమిపట్టితలలు వొంచి భుజముకెత్తివీరుడా నువ్వమరుడన్నయ్నీబాటలోనే మా అడుగులన్నయ్ కన్నీటి జ్ఞాపకాలు తొలుచుకొచ్చేబాధా బాసా మసిలే నెత్తురూ సరేదారి పొడవునా ఒలికిన త్యాగాలేచరిత్ర