వ్యాసాలు

దోపిడీ ప్రయోజనాలే రాజ్యాంగ విలువగా మార్చారు

విప్లవ రచయితల సంఘం 29వ మహాసభలో పాల్గొనటానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి విచ్చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనలు! గత సంవత్సరం జనవరి ఏడవ తేదీన హైదరాబాదులో జరిగిన విరసం అధ్యయన తరగతుల సందర్భంగా ఫాసిజాన్ని అర్థం చేసుకోవడం గురించిన చర్చలో మా అభిప్రాయాలను వివరించిన సంగతి ఒకసారి మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. ప్రస్తుతం మనం అత్యంత సంక్లిష్ట సంక్షోభ సాంస్కృతిక వాతావరణంలో ఇక్కడ సమావేశమవుతున్నాం. ఇదంతా మన సామాజిక జీవితంలో, ప్రజల రోజువారీ అనుభవంలో ఉన్న సంక్షోభపు వ్యక్తీకరణగా భావించవచ్చు. 75 సంవత్సరాల క్రితపు అర్థవలస అర్థఫ్యూడల్‌ వ్యవస్థనుండి మౌలికంగా తెగతెంపులు చేసుకోగలిగిన నిజమైన ప్రజాస్వామిక మార్పు