వ్యాసాలు

హిందూయిజం ఒక అబద్ధం
హిందూ మెజారిటీవాదం అగ్రకులాల సృష్టి

1వర్తమాన భారతదేశంలో ప్రసారమాధ్యమాలన్నీ ‘‘హిందూ జాతీయవాదం’’ చేతిలో బందీలయ్యాయి. రాజకీయాలలో ఆమోదయోగ్యమైన ఒకే ఒక దృక్పథంగా హిందూ జాతీయవాదం కనపడుతోంది. దీని ప్రకారం ‘హిందూ’ అనేది ఒక పురాతన మతం, దానితోపాటు కల్పనాత్మకంగా పుట్టిన ఒక నరవర్గ (ఎథినిక్‌) సమూహం. ఆ కారణంగా ‘హిందువులు’ ఈ దేశపు శాశ్వతమైన స్వదేశీయులైపోయారు. భారతదేశాన్ని చరిత్ర పూర్వదశకు (అచారిత్రక) తీసుకువెళ్లడానికి ఈ రాజకీయ పథకం ప్రయత్నిస్తూంది. ప్రాచీన గ్రీకుల నుండి ఐరోపా వలస శక్తులవరకు, దేశం వెలుపల వున్న ‘మ్లేచ్చులు’ లేదా అపవిత్రులు, మిశ్రమజాతుల నుండి, స్వతంత్రంగా వున్న జాతి హిందువులని నిర్ధారించే ఆలోచన ఈ పధకానికి వున్నది. రామాలయ నిర్మాణానికి