కరపత్రాలు

కార్పొరేటీకరణ – భారత రాజకీయార్థిక వ్యవస్థ సదస్సు

కామ్రేడ్‌ కనకాచారి స్మృతిలో దేశాన్ని అమ్మేస్తున్నవారే దేశభక్తిని ప్రచారం చేస్తున్నారు. దేశభక్తిలో తమను మించిన వాళ్లు లేరని దబాయిస్తున్నారు. మిగతా అందరినీ దేశద్రోహులని చెరసాలలో పెడుతున్నారు. ఇప్పుడు దేశభక్తి అంటే ప్రజల సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడం. మోదీ తనకు ప్రియమైన ఆదానీని ప్రపంచ కుబేరుల్లో నాలుగో స్థానంలో నిలబెట్టడం. దీని కోసం ఉన్న చట్టాలన్నిటినీ ఉల్లంఘించడం. ఇష్టం వచ్చినట్లు మార్చేయడం. నిరంకుశ చట్టాలు తీసుకరావడం. ఇదీ ఇవాళ దేశభక్తి విశ్వరూపం. దేశభక్తి రహదారిలో భారత ఆర్థిక వ్యవస్థ కార్పొరేటీకరణ అంతిమ లక్ష్యంతో శరవేగంగా పరుగులు తీస్తోంది. ప్రజల రక్త మాంసాలతో ఉత్పత్తి అయిన సంపదలను, అపారమైన సహజ వనరులను