ఆకుపచ్చని అమ్మ
ఓ గొంతు మూగబోతే ఆ గజ్జె నీది కానేకాదు ఓ స్వరంలో అలలు ఎగిసిపడటం ఆగిపోతే కొన్ని అలల్లో కొన్ని కాంతులు మాయమవుతే ఆ సముద్రం నీది కానేకాదు కటకటాల వెనుక కాంతిరెక్కవు నువ్వు నీ సముద్రం, నువ్వైన సముద్రం ఎప్పటికీ ఆవిరి కాదు, ఎన్నటికీ మూగబోదు ప్రజాద్రోహం చేయకూడదని పాఠాలు చెప్పినవాడివి నీ కంఠం ఆదివాసుల పేగుల్లో కవిత్వం పలుకుతున్నది నీ కంఠం అన్నం మెతుకులకు కవాతు నేర్పుతున్నది మనిషి అమరుడైతే ఓ కంటిని తడి చేసుకున్న వాడివి మరో కంట్లో కత్తులకు బట్ట చుట్టని వాడివి అమరుల కనురెప్పల కవాతులో ఓ రెప్పవైన వాడిని నవ్వులో