2021 సెప్టెంబర్లో కేంద్రహోం మంత్రి తన సహచర మంత్రులతో పాటు 10 విప్లవోద్యమ ప్రభావిత రాష్ట్రాల మంత్రులు, ముఖ్య మంత్రులు, ప్రభుత్వ, పోలీసు, అర్ధ సైనిక అధికారులతో ఢిల్లీలో జంబో సమావేశం జరిపాడు. అందులో యేడాదిలోగా దేశంలో విప్లవోద్యమాన్ని తుదముట్టిస్తామని ప్రకటన చేశాడు. కానీ అది సాధ్యం కాలేదు. ఈ ప్రకటన చేసి సరిగ్గా ఏడాది. ఈ సంవత్సరమంతా అణచివేత మధ్యనే విప్లవోద్యమం పురోగమించింది. ఈ రెంటినీ ఈ సందర్భంలో పరిశీలించడమే ఈ వ్యాసం ఉద్దేశం. విప్లవోద్యమాన్ని అణచివేత చర్యలతో తుదముట్టించడం సాధ్యం కాదు. అది ఈ ఏడాదిలో మరోమారు రుజువైంది. అయితే గత సంవత్సర కాలంలో భారత