సంభాషణ

ఢిల్లీలో రైతులపై పోలీసుల క్రూరత్వం

యువ రైతు శుభ్ కరణ్ సింగ్ దారుణ హత్యకు, భద్రతా దళాలు రైతులపై కొనసాగిస్తున్న హింసకు నిరసనగా ఫిబ్రవరి 23ను బ్లాక్ డేగా జరపాలని సమైక్య కిసాన్ మోర్చా (ఎస్‌కెఎమ్), రాష్ట్ర అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం (సిఎఎస్ఆర్)లు ఇచ్చిన పిలుపుకు ప్రతిస్పందనగా, జంతర్‌మంతర్ దగ్గర శాంతియుత ప్రదర్శన కోసం యిచ్చిన  పిలుపుకు ప్రతిస్పందనగా, నేను ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు నా సంఘీభావాన్ని తెలియచేయడానికి  వెళ్ళాను. నిరసనకారులెవరూ  అక్కడ లేరు కానీ పోలీసులు, ఇండియన్ టిబెటన్ బార్డర్ పోలీసులు (ఐటిబిపి) పెద్ద సంఖ్యలో ఉన్నారు. అక్కడనుంచి  మెట్రో స్టేషన్ కు వెళ్ళాను, అక్కడ వివిధ విద్యార్థి సంస్థలకు