(నయా ఉదారవాదం అనే పదం నిజానికి ఒక misnomer – తప్పు సంకేతాన్ని ఇచ్చే పదం. కానీ కొన్ని సామ్రాజ్యవాద విధానాల సమాహారానికి నయా ఉదారవాదం అనే పేరు పడినందుకు మాత్రమే ఆ పదాన్ని ఈ వ్యాసంలో ఉపయోగించాను. సారాంశంలో అది సామ్రాజ్యవాద విధానమే, నయా వలసవాద దోపిడీ పద్ధతే.) దక్షిణ అమెరికా దేశాలలో పింక్ వెల్లువ తిరుగుబాట్లు, అరబ్ దేశాలలో జరిగిన అరబ్ వసంత తిరుగుబాట్లు, అమెరికా, యూరోప్ దేశాలలో జరిగిన ‘బ్లాక్ లైవ్స్ మాటర్’ ఉద్యమాల తరువాత అంత పెద్ద ఎత్తున ప్రజల తిరుగుబాటు ఎగిసి పడుతున్న దేశం శ్రీలంక. ప్రజల తిరుగుబాటువల్ల తప్పనిసరి పరిస్థితిలో