ఇంటర్వ్యూ సంభాషణ

విరసం రచయిత్రి నల్లూరి రుక్మిణితో ఇంటర్వ్యూ

కథలు రాస్తూ నవలలోకి రావాలని ఎందుకు అనిపించింది? నా కథలు అన్నీ దాదాపు సామాజిక సమస్యలకు సంబంధించినవే. ఈ రకమైన ఇతివృత్తాలకు 'చమక్కు' మనిపించే నైపుణ్యతకంటే 'నెరేటివ్‌' విధానం- పాఠకుడికి సులభంగా అర్ధమవడానికి వీలవుతుంది. అందువల్లే నేను కథను నైపుణ్యీకరించే క్రమం మీద ఎక్కువ శ్రద్ద పెట్టలేదు. సామాన్య పాఠకుడికి చేరాలన్నదే నా లక్ష్యం. దానివల్ల నా కథలు పెద్దవిగా వుండేవి. అలా రాస్తున్న క్రమంలో కథకంటే నవలలో జీవితాన్ని మరింత వివరించగలననిపించింది. అంటే, జీవితంలో వుండే ఆర్థిక సామాజిక, రాజకీయ ప్రాధాన్యతలను చెప్పడానికి నవలలో అయితే వీలవుతుందనుకున్నాను. నా మొదటి నవల 'నర్రెంక సెట్టు కింద' అలా