సాహిత్యం సమీక్షలు

విప్లవోద్యమాన్ని సృజనాత్మకంగా ఆవిష్కరించిన కథలు

నేను ఈ మధ్య అల్లం రాజయ్య గారు సంపాదకత్వం వహించిన దండకారణ్యం కథలు చదివాను. ఈ పుస్తకాన్ని విరసం వాళ్ళు ప్రచురించారు. ఈ కథలు మూడు సంపుటాలుగా రావడం జరిగింది. ఈ కథలన్నీ అరుణతారలో ప్రచురణ అయ్యాయి. మొదటి కథల సంపుటి 2005 - 2012. 16 కథలతో మొదటి సంఖలనం తీసుకువచ్చారు. 2013 -2017 మొత్తం 8 కథలతో రెండవ సంకలనం ప్రచురించారు. 2016 -2019 మొత్తం14 కథలతో మూడవ కథల సంకలనం తీసుకువచ్చారు. ఈ కథలలో గత 50 సంవత్సరాలుగా మూడు తరాలుగా సాగుతున్న నూతన ప్రజాస్వామిక రాజ్యాధికార దిశగా సాగుతున్న విప్లవోద్యమాన్ని సాహిత్య పరంగా