నాక్కొన్ని మాటలు కావాలిప్పుడు నిజాం పోలిక సరిపోదు హిట్లర్ ముస్సోలిని అస్సలు అతకదు ఇంతకన్నా గొప్పగా చెప్పడానికి నాక్కొన్ని మాటలు కావాలిప్పుడు మనిషి కాదు పశువు మద మగ మృగం ఊ...హు! కీచకుడు దుశ్శాసనుడు ఐనా అసంపూర్ణమే "మో- షా"ల మొఖం గుమ్మాలమీద ఉమ్మేయడానికి జనం ముక్కోపం పదకోశంలో లేని మాటలు కావాలి తిట్ల దండకాల గ్రంథాలలో దొరకని మాటలు కావాలి అందుకే, నాక్కొన్ని మాటలు కావాలి గుజరాత్ నుండి కాశ్మీర్ మీదుగా ఇప్పుడు మణిపూర్ దాకా మంటలతో వచ్చాడు వాడు కొండకీ మైదానానికీ మధ్య చిచ్చు పచ్చగడ్డేసి రాజేసి మతం మంటల్తో చలిమంటలు కాగుతాడు వాడు నెట్