సంభాషణ

బందీ అయిన గణతంత్ర రాజ్యంలో ఒక ఖైదీ భార్య

భర్తను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన తరువాత ఆ గృహిణి జీవిత కథనం తన ముగ్గురు పిల్లలను నిద్ర లేపడం, వారిని, అందులోనూ ప్రత్యేకించి ఏడేళ్ల పిల్లవాడిని ఆన్‌లైన్ తరగతులకు కూర్చోబెట్టడం,  వారు తమతమ స్థలాల్లోనే కూర్చునేట్లుగా చూడడం, క్లాసు జరుగుతున్నప్పుడు వీడియో గేమ్‌లు ఆడకుండా, నిద్రమత్తులోకి జారిపోకుండా లేదా కొట్లాడుకోకుండా చూసుకోవడం లాంటి పనులతో ఉదయం పూట కొంచెం హడావిడిగా ఉంటుంది: గత 17 నెలలుగా ఇదంతా ఒంటరిగా చేస్తూండడంతో ఆ హడావిడి మరింత ఎక్కువవుతుంది. ఆమెకు పెళ్లై 14 వ సంవత్సరాలయింది. 2007 లో వివాహ ప్రతిపాదన వచ్చినప్పుడు, కనీసం ఒక్కసారైనా విడిగా కలిసి మాట్లాడుకోవాలనుకున్నారు,