(వాకపల్లి మహిళల కు న్యాయం జరిగిందా ? ఆదివాసులకు, అందునా ఆదివాసీ మహిళ లకు న్యాయం చేసే వ్యవస్థలోనే మనం ఉన్నామా? కోర్టు తీర్పు నేపథ్యంలో విరసం . ఆర్గ్ జూన్ 1 , 2016 లో గతంలో అచ్చయిన ఈ వ్యాసం పాఠకుల కోసం.. - వసంతమేఘం టీం ) విశాఖపట్నం దగ్గర కరకవానిపాలెంలో అమరుడు కామ్రేడ్ అజాద్ సంస్మరణ సభ భావోద్వేగాలతో జరుగుతున్నది. ఆ సమయంలో నా పక్కన కూర్చున్న లాయర్ బాలక్రిష్ణ ‘వాకపల్లి వెళుతున్నాం వస్తారా?’ అని అడిగాడు. ఛిద్రమైపోతున్న ప్రజల జీవితం గురించి దాదాపుగా రెండు గంటలుగా ఆ సభ జరుగుతున్నది.