వ్యాసాలు

దేశవాళీ ప్రాంతీయ ప్రాతినిధ్య కథకుడు సభా

ఇది కె. సభాగారి శత జయంతి సంవత్సరం (01-07-1923  -  04-11-1980) దేశవాళీ గుభాలింపును, రాయలసీమ నుడికారాన్ని మానవ సంబంధాల వైచిత్రిని, పల్లె సొగసులని, సంస్కృతి సంప్రదాయాలని ఆటపాటలని వంటలని, పండుగలని, ప్రకృతి అందాలను ఇలా సమస్తాన్ని తన రచనల్లో అత్యంత హృద్యంగా చిత్రీకరించిన తెలుగు రచయిత కె .సభా గారు.  ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా, రైతు ఉద్యమాలలో ప్రత్యక్షంగా ప్రజలు, రైతులు, దళితులు వైపు నిలబడి పోరాడడానికి  పది సంవత్సరాలుగా పని చేస్తున్న ఉపాధ్య వృత్తి నుండి   బయటపడి  పత్రికా రంగాన్ని ఎన్నుకొని ఉద్యమ స్పూర్తితో పాత్రికేయుడుగా, సంపాదకుడిగా ఒక సామాజిక కార్యకర్తగా పనిచేసిన
సాహిత్యం కాలమ్స్ కథావరణం

పెత్తనం చలాయించే కర్ర చేతులు మారితే ఆ కథే వేరు!

సాహిత్యంలో చాలా ముఖ్యమైన కథలు అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేయగలిగితే, పాఠకలోకం శ్రద్ధాసక్తులతో తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని కథల్ని వర్గీకరించగలిగితే అందులో తప్పనిసరిగా ఉండాల్సినవి గీతాంజలి  కథలు.  అచ్చవున్న  కథలలో చాలా కథలను చదవకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదన్నది ఆ కథలు చదివిన తక్షణమే అనిపిస్తుంది. సాహిత్య చరిత్రలో భాగంగా గుర్తించి తప్పకుండా  చదవాల్సిన ముఖ్యమైన కథల జాబితా ఒకటి ఇమ్మంటే.. అందులో తప్పనిసరిగా గీతాంజలి కథలుంటాయి. ఎందుకంటే ఈ కథలను చదవటం ఒక  సామాజిక చారిత్రక అవసరం. ఈ కథలను చదవకపోతే పాఠకులకు ఈ కథలలోని జీవితం  మనుషుల సంఘర్షణలు, మనుషుల వ్యక్తిగత అంతర్గత
సాహిత్యం కాలమ్స్ కథావరణం

” రైలు కూడా మొగోడే..అంటున్న వినోదిని కథ ‘కట్ట’ “

డాక్టర్ వినోదిని రాసిన "కట్ట" కథ అరుణతారలో 2015 జనవరిలో ప్రచురితమైంది. ఆమె రాసిన 11 కథలతో "బ్లాక్ ఇంక్" కథాసంపుటిని లిఖిత ప్రెస్ హైదరాబాద్ వారు 2015 అక్టోబర్ లో ప్రచురించారు. ప్రధాన స్రవంతి పత్రికలు అచ్చు వేయడానికి నిరాకరించిన  కథలివి.వాడల లోపలి కథలు.  అసలు కథలు ఎందుకు ప్రచురించడానికి భయపెడతాయి? కథలు ప్రచురించడంలో మొహమాటం ఏమిటి? దాపరికం ఏమిటి? నామోషీ ఏమిటి? తరతరాల సంప్రదాయ వాసనలు కొడుతున్న పత్రికల్లో పీతి వాసన గురించిన కథలంటే భయం కలగడం సహజమే.ఈనాడు మంచి రచయితలు తమ కథల్ని ప్రచురించడానికి మంచి పత్రికలను వెతుక్కోక తప్పని పరిస్థితి. పత్రికలకు మంచి
కాలమ్స్ కథావరణం

” హత్యకు గురైంది ఎవ‌రు? పిచ్చివాడు అయింది ఎవరు? నిజాలు తెలిసేది ఎప్పటికీ? “

కథలను చివరి వరకూ  బ్రతికించేది..జీవద్భాషే అనిపిస్తుంది ఈ కథలను చదివినప్పుడు.అవును!కథా లక్షణాల బరువులను సూత్రీకరణలను,  నియమాలను, వస్తువు ,శైలి, శిల్పంఇలాంటివి కాసేపు పక్కన పెడితేనికార్సయిన జీవద్భాష లో మనుషులు సహజంగా మలినం లేకుండా మాట్లాడుకుంటే, రచయిత ప్రమేయమే లేదనేంత  సహజత్వం ఉంటేఅవి "మునికాంతనపల్లి" కథలు అవుతాయి.ఇవి కథలు కావు కతలు. ఊహించి రాసినవి కావు, కల్పనలు అసలే కావు. కొంచెం అలా నెల్లూరు జిల్లా దాకా వెళ్లి వస్తే, అక్కడ  మనం వినాల్సిన గుండెలు గొంతులు,మనసులు చాలా ఉన్నాయని, మనం తప్పకుండా వినాల్సిన సత్యాలు చాలా కాలం చాలా  మరుగునే ఉండిపోయాయని, ఇన్నేళ్లకు ఆ గొంతుల్ని ఆ గుండెల్ని