వ్యాసాలు

దండకారణ్యంలో మళ్లీ బాంబు మోతలు

విజయవాడ విరసం సభల్లో ఆట పాటలతో ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని, పోరాడి గెలవగలమనే విశ్వాసాన్ని అందించిన మూలవాసీ సాంస్కృతిక్‌ కళా మంచ్‌ సభ్యులు తమ గూడేలకు చేరుకున్న కాసేపటికే డ్రోన్‌ దాడులు మొదలయ్యాయి. ఈరోజు(జనవరి 30) మధ్యాహ్నం 2 గంటల సమయంలో బీజాపూర్‌ జిల్లా ఒట్టిగూడ పక్కన పంట పొలాల్లో ఆకాశం నుంచి బాంబులు కురిశాయి. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఉధృతంగా డ్రోన్‌ హెలికాప్టర్‌ దాడులు జరిగాయి. ఇటీవల కొద్ది విరామం తర్వాత, ఎన్నికలు జరిగి బీజేపీ అఽధికారంలోకి వచ్చాక పైనిక చర్యలు తీవ్రమయ్యాయి. ఇవాళ జరిగిన దాడిని అందులో భాగంగానే చూడాలి. ఈ నెల 1వ తేదీ
వ్యాసాలు

తెలుగు ప్రజల రాజకీయ, సాంస్కృతిక వికాసంలో ‘నిషేధిత’సంఘాలు

‘ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం తేలిక. ప్రజాస్వామికీకరణ చాలా కష్టం’ అని ప్రొ. శేషయ్యగారు తరచూ అనేవారు. మనలాంటి సమాజాల్లో పౌరహక్కులు   ప్రజల అనుభవంలోకి రాగల రాజకీయ, సాంస్కృతిక వాతావరణం ఏర్పడ్డం ఎంత కష్టమో చెప్తూ ఈ మాట అనేవారు. భూస్వామ్యం సాంస్కృతికంగా కూడా బలంగా ఉన్న చోట ప్రజా స్వామికీకరణకు చాలా అడ్డంకులు ఉంటాయి. ఎవరో కొంతమంది ఉదాత్త ఆశయాలతో  ప్రజాస్వామ్యం కోసం పని చేసినంత మాత్రాన అది ఎన్నటికీ ఒక భౌతిక వాస్తవంగా మారదు. వాళ్ల కృషి దోహదకారి కావచ్చు. అంత వరకే. ఆధిపత్య సంబంధాల్లో అణగారిపోతున్న జనం మూకుమ్మడిగా లేచి పోరాటాల్లోకి వచ్చినప్పుడే   ప్రజాస్వామ్యానికి కుదురు
వ్యాసాలు

పసి పాపల నిదుర కనులపై ముసిరిన యుద్ధోన్మాదం ఎంతో..

పాలస్తీనా స్వేచ్ఛాకాంక్షపై జరుగుతున్న యుద్ధంలో పసి పిల్లల మరణాలు ప్రపంచ మానవాళిని కలచివేస్తున్నాయి. యుద్ధం ఎక్కడ జరిగినా, ఏ రూపంలో జరిగినా నెత్తురు ప్రవహించాల్సిందే. చరిత్ర పొడవునా రాజకీయాల కొనసాగింపుగా సాగిన యుద్ధాలన్నీ తీవ్రమైన విధ్వంసానికి, విషాదానికి కారణమయ్యాయి. ఏ నేల మీది జరిగే యుద్ధాలకైనా దురాక్రమణే లక్ష్యం. అది పాలస్తీనాలో ఒక రకంగా ఉండొచ్చు. కశ్మీర్‌లో ఇంకోలా ఉండొచ్చు. దేశం మధ్యలోని దండకారణ్యంలో మరోలా ఉండొచ్చు. ఎక్కడైనా సరే, ఏ రూపంలో అయినా సరే దురాక్రమణ కోసం సాగే యుద్ధాలు పిల్లలను బలి తీసుకుంటాయి. పాలస్తీనాలో చనిపోతున్న పిల్లల కోసం అనుభవిస్తున్న అనంతమైన దు:ఖం దండకారణ్యాన్ని కూడా
సంపాదకీయం

మావోయిస్టు పార్టీ మీద నిషేధంఎందుకు ఎత్తేయాలంటే…

విష్లవ పార్టీ మీద నిషేధం తొలగించాలని కోరడం అంత మామూలు డిమాండ్‌ కాదు.  దీని చుట్టూ ఎన్నో అంశాలు ఉన్నాయి. కాబట్టి సహజంగానే చాలా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాటన్నిటినీ చర్చించాల్సిందే. ముందు ఆ పని చేయకపోతే నిషేధం తొలగించాలని ఎందుకు కోరుతున్నామో చెప్పలేం. మావోయిస్టు పార్టీ మీద నిషేధం ఎత్తేయాలనే మాట 2004 తర్వాత మళ్లీ ఇవ్చుడే వినిపిస్తోంది. ఇంత నుదీర్ఘకాలం ప్రస్తావనలో లేకపోవడం వల్ల ఈ డిమాండ్‌ చాలా కొత్తగా ఉన్నది. ఎంతగానంటే మావోయిస్టుల మీది నిషేధం మామూలే కదా! అని సమాజం చాలా వరకు కన్విన్స్‌ అయిపోయింది. చర్చ లేకుండా, చర్చించాల్సిన విషయం కాకుండాపోయి, దాని
వ్యాసాలు కొత్త పుస్తకం

ఫాసిజాన్నిసమగ్రంగా చూపే వ్యాసాలు

(డిశంబర్ 23 న విజయవాడలో విడుదల కానున్న *కార్పొరేట్ హిందుత్వ ఫాసిజం* పుస్తకానికి రాసిన ముందుమాట. *దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం* ఈ పుస్తకాన్ని ప్రచురించింది.) ఫాసిజాన్ని మౌలికంగా ఓడించే  పోరాటాలు నిర్మాణం కావలసే ఉన్నది. ఆ వెలితి దేశమంతా ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో కూడా  కనిపిస్తోంది. అయితే ఫాసిజాన్ని సమగ్రంగా అర్థం చేసుకొనే ప్రయత్నం మిగతా భాషల్లో కన్నా మన దగ్గరే  లోతుగా జరుగుతున్నదని నా అభిప్రాయం. ఇప్పటికీ ఇండియన్‌ ఫాసిజాన్ని మతతత్వమని, మతోన్మాదమని, మెజారిటేరియనిజమని, మత ఫాసిజమని అనే వాళ్లు చాలా మంది ఉన్నారు. ఈ అవగాహనలు కూడా అవసరమే. ఫాసిజంలోని కొన్ని కోణాలను ఇవి వివరిస్తాయి.
సంపాదకీయం

పోతూ పోతూ కూడా..

.. ఈసారి ఆయన అధికారంలోంచి దిగిపోతాడనే అంటున్నారు. ఎప్పటి నుంచో పరిశీలకులు చెబుతూనే ఉన్నారు.  ఎగ్జిట్‌ పోల్‌ అంచనాల్లో అవే కనిపిస్తున్నాయి.  ఎన్నికల్లో ప్రజాభిప్రాయ వ్యక్తీకరణకు  అవకాశం ఉందా? ప్రజా సమస్యల ప్రచారానికి,  పరిష్కారానికి గతంలోలాగా కనీసంగా అయినా ఇప్పుడు ఎన్నికలు ఉపయోగపడతాయా? లేక ఎప్పటిలాగే వంచనలు, ప్రలోభాలు, ఓట్ల కొనుగోళ్లు .. ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయా?  ఎన్నికల ఎత్తుగడవాదుల ప్రయత్నాలు ఓట్ల ఫలితాలను కనీసంగా అయినా ప్రభావితం చేస్తాయా?   అని ఎంత విశ్లేషణ అయినా ఇవ్వవచ్చు.  కాకపోతే  పదేళ్ల నియంతృత్వ పాలన మీద ఈ ఎన్నికల సమయంలో కూడా తెలంగాణ పదునైన విమర్శను  వినిపించింది. ఎన్నికల రాజకీయాల్లో
సంపాదకీయం

పాతవి కొత్తగా మారడం

పాతవి పోతాయి. కొత్తవి వస్తాయి. ఇండియాలో ఇది చాలా విచిత్రంగా జరుగుతుంది. వికృతంగా ఉంటుంది. మన సామాజిక మార్పు అంతా ఇట్లాగే జరిగింది. అందులో ఈ ధోరణి ప్రధానమైనది. అది తెలుసుకోలేక చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు. ఇన్ని దశాబ్దాలలో ఏ మార్పూ రాలేదా?..అంటే వచ్చింది. చాలానే మారింది.  కానీ పాతదానితో తెగతెంపులు జరగని మార్పులు ఇవి. ప్రతి మార్పూ  వెనుకటిదాన్ని వెంటేసుకొని కొత్తగా  వస్తుంటాయి. ఇది సామాజిక సాంస్కృతిక రంగాల్లో కనిపించినంతగా చట్ట, పాలనా రూపాల్లో కనిపించకపోవచ్చు. కానీ స్థూలంగా పాతది కొత్తగా మారే ఈ చట్రంలోనే అన్నీ భాగం. జూలై 20 నుంచి ఆగస్టు 11
సంపాదకీయం

గద్దర్‌ మరణానంతరం

పది రోజులుగా అంతటా గద్దరే. అందరి నోటా గద్దరే. ఆయన పాటను తాము ఎట్లా విన్నామో చెప్పుకుంటున్నారు. ఆ పాట తమనెలా కుదిపి నిలబెట్టిందో గుర్తు చేసుకుంటున్నారు. ఆయన కవిత్వాన్ని, గొంతును, హావభావాలను, ఆహార్యాన్ని, ఆడుగుల సవ్వడిని తలపోసుకుంటున్నారు.  వ్యక్తిగా ఆయన గురించి తమకెట్లా ఎరుకైందో దగ్గరిగా చూసిన వారు తలచుకుంటున్నారు. ఈ మొత్తంలో దేనికదే చూస్తున్నవారున్నారు. అన్నీ కలిపి ఎట్లా అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నవారు ఉన్నారు. ఆయన పాటను అనుభవించాల్సిందేగాని కొలతలు వేయవద్దంటున్నవారు ఉన్నారు. తామూ అంచనా వేస్తున్నామనే సంగతి మర్చిపోయి కొంచెపు అంచనాలు వేయవద్దనే వాళ్లూ ఉన్నారు. అసలు ఏ అంచనాలకు గద్దర్‌  మూర్తిమత్వం లొంగదనే
సంపాదకీయం

రాజ్యాంగం చెప్పినవన్నీ చేశారా? ఉమ్మడి పౌరస్మృతి తేవడానికి..

ప్రజా క్షేత్రం గురించి బీజేపీకి బాగా తెలుసు. ఎంత బాగా తెలుసో అర్థమయ్యే కొద్దీ మనకు ఆందోళన పెరుగుతుంది. మామూలుగా  కామన్‌సెన్స్‌లో భాగంగా సంఫ్‌ుపరివార్‌  ఈ సమాజాన్ని మధ్య యుగాల్లోకి తీసికెళుతుందనే విమర్శ చాలా మంది చేస్తుంటారు. తన మీద ఇలాంటి అభిప్రాయం ఉన్న ఈ సమాజంతో  సంఫ్‌ు ఎట్లా వ్యవహరిస్తుంది? నిజంగానే ఈ దేశంలోకి ముస్లింలు రాకముందటి రోజులే ఉజ్వలమైనవని,  కాబట్టి  సమాజాన్ని  అక్కడికి తీసికెళతానని అనగలుగుతుందా? సంఫ్‌ుపరివార్‌కు ఇలాంటి భావజాలంలో కూడా ఉన్నది. ఒక ‘అద్భుతమైన’ గతాన్ని ఊహించి  చెప్పి, దాని చుట్టూ భావోద్వేగాలు లేవదీసి, ‘ఇతరుల’ మీద విద్వేష విషాన్ని నింపి, ‘తనదే’ అయిన
సంపాదకీయం

అకాడమీ  ఎందుకు  అవార్డులిస్తుందో  రచయితలకు తెలియదా?

మంచికో చెడుకోగాని తేనెతుట్టె మరోసారి కదిలింది. అకాడమీ అవార్డుల మీద తీవ్రమైన చర్చే జరిగింది. ఫేస్‌బుక్‌ మీద కాబట్టి ఇంతకంటె గొప్పగా ఉండాలని ఆశించేందుకు లేదు. నింపాదిగా, నిలకడగా మాట్లాడుకోలేకపోవడం, తక్షణ ప్రతిస్పందనతో సరిపెట్టుకోవడం ఇవాల్టి మేధో సంస్కృతి. అట్లని అంతా ఇదే కాదు. తెలుగులో ఓపికగా జరుగుతున్న అత్యవసరమైన మేధో అన్వేషణ కూడా ఉన్నది. కేంద్ర సాహిత్య అకాడమీ గురించి, అది అవార్డులను ప్రకటించే పద్ధతి గురించి గతంలో కూడా చాలా వాద వివాదాలు జరిగాయి. అయితే ఇప్పటికైనా ఈ చర్చ అన్ని రకాల అవార్డులు, సన్మానాలు, పురస్కారాల గురించి  మరింత దృఢంగా ముందుకు సాగవలసి ఉన్నది.