నివేదిక

ఉద్యోగ హక్కు చట్టం చేయాలి

మిత్రులారా మీ అందరికీ పాలమూరు అధ్యయన వేదిక పక్షాన స్వాగతం ! భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశ స్థాయిని అందుకోబోతున్నది ఎంత నిజమో ప్రపంచంలో అత్యధిక నిరుద్యోగులున్న దేశం అనేది కూడా ఆ స్థాయి నిజం. అయితే నిరుద్యోగ సమస్య నివారణకు ప్రభుత్వాలు, విధానకర్తలు ఏమీ చేయటం లేదు అనేది అంతకన్నా కఠినమైన నిజం. గత యుపిఎ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను గాలికి వదిలేసిందని మేం అధికారంలోకి వస్తే దేశంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన ఎన్‌.డి.ఎ పాలకులు ఆ విషయాన్ని వదిలేశారు. అలాగే 1994 నుండి మొదలైన మలిదశ తెలంగాణ పోరాటం