వ్యాసాలు

రాజును చంపడం ఎందుకు తప్పు?

సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ళ పసిపాపను అత్యంత దుర్మార్గంగా అత్యాచారం చేసి చంపిన రాజు రైలు పట్టాలపై శవమయ్యాడు. రాజు ఆత్మహత్య చేసుకున్నాడా, అతన్ని చంపేసి పట్టాలపై పడేశారా అన్న విషయంపై అనుమానాలున్నాయి కాని జనం న్యాయం జరిగిందని ఊపిరి పీల్చుకున్నారు. నిలువెల్లా గగుర్పాటు కలిగించిన సైదాబాద్ సంఘటనకు చలించని మనసు లేదు. ఎంత మంది తమ పిల్లలని పొదువుకొని గుండెలు గుబగుబలాడగా దుఃఖితులై ఉంటారో అందరూ ఆ పని చేసినవాడ్ని ఏం చేసినా పాపం లేదని అనుకొని ఉంటారు. అందరూ శపించినట్లుగానే రాజు దిక్కులేని చావు చచ్చిపోయాడు. న్యాయం జరిగిందని చాలా మంది అనుకుంటున్నారు. నిజంగా న్యాయం
సాహిత్యం వ్యాసాలు

నిశ్శబ్దంగా నిష్క్రమించిన రచయిత

మూడేళ్ళ క్రితం ఓ పెద్దాయన నన్ను వెదుక్కుంతూ మా కాలేజీకి వచ్చారు. డెబ్బై ఏళ్లు ఉండొచ్చు. నల్లగా, అంత ఎత్తూ కాని, లావూ కాని పర్సనాలిటీ. మనిషి చాలా నెమ్మది అని చూడంగానే అర్థమవుతుంది. పరిచయం చేసుకొని తాను రాసిన కథల గురించి చెప్పారు. దేవిరెడ్డి వెంకటరెడ్డి - పేరు విన్నట్టుగా ఉంది. కథలు గుర్తు రావడం లేదు. ఇప్పటి వరకు పుస్తకం పబ్లిష్ చేయాలనుకోలేదని, ఇప్పుడు ఆ ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. దీన్ని విరసమే ప్రచురించాలని తన కోరిక అన్నారు. నేను సంస్థలో చర్చిస్తానని చెప్పాను. ‘ముందుమాట మీరే రాయాలి’ అన్నారు. ఆశ్చర్యపోయాను. విరసం సరే, నేను