ఫోర్బ్స్ 2021 నివేదికను మనం విశ్వసిస్తే,(బిలియనీర్ల సంఖ్య, వారి సంపదను లెక్కించడం లో ఫోర్బ్స్ సంస్థ అత్యంత విశ్వనీయతను మనం ప్రశ్నించగలమా?) గత సంవత్సర కాలంలో ఇండియాలో బిలియనీర్ల సంఖ్య 102 నుండి 140 కి పెరిగింది. ఆదేకాలంలో, వారి ఉమ్మడి సంపద ఇంచుమించు రెండింతలు. అంటే,596 బిలియన్ డాలర్లకు చేరింది. 140 మంది వ్యక్తుల లేక దేశజనాభాలో 0.000014 శాతం మంది మొత్తం సంపద, మనదేశ స్థూల ఉత్పత్తి(2.62 ట్రిలియన్ డాలర్ల)లో, 22.7 శాతం గా వుండటం గమనార్హం. (స్థూల అనే పదానికి అర్థమూ ,పరమార్థమూ చేకూర్చేది వారేగా!) దేశ ప్రధాన దినపత్రికలన్నీ ఫోర్బ్స్ నివేదికను