వ్యాసాలు

ప్రియమైన అమ్మా…

ఈ విషాద సమయం ఇలా వస్తుందనుకోలేదు. 90 సంవత్సరాల వయసులో నాన్న సెప్టెంబర్‌ 30, 2022న మనల్ని వదిలి వెళ్లిపోయాడునే దుఃఖకరమైన సమాచారాన్ని పేపర్లో చూశాను. నేను మిమ్మల్ని విడిచి విప్లవ పథంలో అడుగు పెట్టాక నాన్న మరణ వార్తతో నాకు నాలుగు దశాబ్దాల కిందటి విషయాలన్నీ గుర్తకు వచ్చాయి. నీతో, నాన్నతో, న కుటుంబసభ్యులతో, ఊళ్లో వాళ్లతో గడిపిన రోజులన్నీ నా మనసులోకి వచ్చాయి. నేను విప్లవంలోకి రావడానికి ముందు మీ అందరి ప్రేమతో, వాత్సల్యంతో జీవించడం వల్లే ఇప్పుడు ఇలా నేను ఎంచుకున్న మార్గంలో నడవగలుగుతున్నానని అనిపించినప్పుడు మీ అందరి మీదా మరింత గౌరవం కలుగుతోంది.