వ్యాసాలు

హిడ్మే మర్కం అక్రమ అరెస్టును ఖండిద్దాం!

హిడ్మే మర్కంను వెంటనే విడుదల చేయాలీ! చత్తిస్‌ఘఢ్‌లో పౌర హక్కుల కార్యకర్తలపై వేధింపులను ఆపాలి! మార్చి 9, 2021 ఛత్తీస్‌‌ఘఢ్ పోలీసులు, పారా మిలటరీ దళాలు అదుపులోకి తీసుకుని శారీరక, లైంగిక హింసలకు గురిచేయడంతో ఆత్మహత్య చేసుకొన్న కావ్య నంది, పండే కవాసీ అనే యిద్దరు ఆదివాసీ యువతుల స్మృతిలో దంతేవాడ, సమేలిలో జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంనుంచి 28 ఏళ్ల ఖనిజ తవ్వకాల వ్యతిరేక, ఆదివాసీ హక్కుల కార్యకర్త హిడ్మే మార్కమ్‌ను నిస్సిగ్గుగా, చట్టవిరుద్ధమైన తీరులో ఎత్తుకెళ్లిన ఘటన మమ్మల్ని దిగ్భ్రాంతుల్ని చేసింది. ఆ తరువాత హిడ్మే మార్కంను, (d/o పోడియం మార్కం, బుర్గం గ్రామం,