బస్తర్ డివిజన్లోని నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ లో సీఆర్పీఎఫ్ క్యాంపు ఏర్పాటు, వివిధ చోట్ల రోడ్డు విస్తరణకు వ్యతిరేకంగా ఆదివాసీలు చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా మే 12, 13 తేదీల్లో వారు జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు పాదయాత్ర చేసారు. దాదాపు 200 రోజులుగా, వేలాది మంది గ్రామస్తులు తమ మూడు అంశాల డిమాండ్ల కోసం అబూజ్మడ్ తోయ్మెటాలో ధర్నాకు కూర్చున్నారు. ప్రభుత్వం తమ మాట వినకపోవడంతో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. రేషన్, నీళ్లతో బయలుదేరారు. అబూజ్‌మడ్‌కు చెందిన వేలాది మంది ఆదివాసీలు శుక్రవారంనాడు మండుతున్న ఎండలో రేషన్, నీరు, నిత్యావసర వస్తువులు, సంప్రదాయ ఆయుధాలతో