వ్యాసాలు

నారాయణపూర్ ఉద్యమం: ఎన్నికలపై ప్రభావం

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో కొనసాగుతున్న ఉద్యమ ప్రభావం ఎన్నికలపై ఎంత ఉంటుంది? దసరా ముగిసిన వెంటనే ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. బస్తర్ డివిజన్‌లో ప్రచార వాహనాలు తిరుగుతున్నాయి. పార్టీ అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారం జరుగుతోంది. నగర వెలుగులకి దూరంగా కొన్ని చోట్ల ఇవేమీ లేకపోయినా ఎన్నికల సందడి నెలకొంది. నారాయణపూర్ అసెంబ్లీలోనూ అదే జరుగుతోంది. చాలా కాలంగా ఇక్కడ ఉద్యమం జరుగుతోంది. ఆదివాసీలు తమ డిమాండ్లతో ఆందోళనలు చేస్తున్నారు. బస్తర్‌లోని అనేక ప్రాంతాలలో ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ, నారాయణపూర్ జిల్లాలోని 5 ప్రదేశాలలో - తోయమెట, మధోనార్, ఇరాక్ భట్టి, దొండి బేడ, ఓర్చా నదిపరాలలో ఉద్యమం చాలా