కవిత్వం

షహీద్ మంగ్లీ కోసం

గజ్జెలు లేకుండా కూడ నీ పాదాలు ఎంత భంగిమలో ఉన్నాయి ఈ పాదాల్లో కొంచెం కొంచెం దుమ్ము పట్టి ఉన్నది ధూళి అనగానే గుర్తుకొచ్చింది నువ్వు నీ ‘యోయో’ (అమ్మమ్మ) ఒళ్లోకి వట్టికాళ్లతోనే గోముతో పరుగెత్తాలనుకోవడం కూడ ప్రేమనే మట్టితో సూటిగా మాట్లాడుతూ నీ కాళ్లు పాదాలు రేలా స్వరంలోకి తర్వాత ఎగుస్తాయి మొదట నీ పాదాలను ఈ మట్టి రమ్మని పిలుస్తుంది నువ్వూ నీ పాదాలు రెండూ ఎంత శాంతంగా ఎంత ప్రకాశిస్తూ, ఎంత నిష్కళంకంగా కనిపిస్తున్నారు నీ గోళ్లు చాల విచారంగా కనిపిస్తున్నాయి నీ అమ్మ దగ్గర నెయిల్కట్టర్ లేదు నువ్వీ పాదాలతో కొంచెం దూరం