కరపత్రాలు

ఆదివాసులపై మోడీ ప్రభుత్వ యుద్ధం

(30-04 -2023   నాగర్‌కర్నూల్‌ జిల్లా   అచ్చంపేటలో జరిగిన సభ కరపత్రం- వసంత మేఘం టీం ) దేశానికే మూలవాసులైన ఆదివాసీలను ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాల్సిన ప్రభుత్వాలు, 1985 నుండి అమానుషంగా వేటాడి హత్యచేస్తున్నాయి. జల్‌, జంగిల్‌, జమీన్‌లపై ఆదివాసులకే హక్కని 1997 సమతా స్వచ్ఛంద సంస్థ వర్సెస్‌ భారత ప్రభుత్వం కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పులో కూడా అడవిపై హక్కు ఆదివాసీలదే అని స్పష్టం చేసింది. కాని అడవిలోని సహజ సంపదను కొల్లగొట్టడానికి, అడవిని విధ్వంసం చేయడానికి సిద్ధమైన పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులవైపే ప్రభుత్వాలు నిలబడ్డాయి. ఎలాగైతే నల్లమలలో ఉన్న 20 లక్షల టన్నుల యురేనియం వెలికి తీసి, అచ్చంపేట నల్లమల