కవిత్వం

వందే అని ఎలా పాడను..!?

ఈ తరం నవతరంమా తరమే యువతరంఅర్ధరాత్రి స్వాతంత్ర్యంచీకటి కోణమేఏ వెలుగు జాడ లేనినిశి రాత్రి నీడలేఅమృతం ఏడ తేనుఉత్సవం ఎలా జరపనువందేమాతరం అంటూఎలా పాడను..!? బక్క చిక్కిన బతుకులుమెతుకుల కోసం ఆరాటంఅకృత్యాల అర్ధనాదాలుఅన్నార్ధుల జాడలులేని రోజు కోసంస్వేచ్ఛకై తపిస్తున్న చోటఅమృతం ఏడ తెనుఉత్సవం ఎలా జరపనువందేమాతరం అంటూఎలా పాడను…!? ఇప్పుడు దేశ భక్తిపాదరసంలా పారుతున్నదిపౌరుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మర్చిఅణచివేత చుట్టివేతలతోకుట్రలకు దారి తీస్తుందిడెబ్భై ఏళ్ళ స్వాతంత్ర్యంలోదేశమే జైలయి తలపిస్తున్న వేలఅమృతం ఏడ తేనుఉత్సవం ఎలా జరపనువందేమాతరం అంటూఎలా పాడను…!? ఈ మట్టి మాదిఈ దేశం మాదిహద్దులు లేని ప్రపంచం మాదిసకల శ్రామిక జనం మా నేస్తంలక్ష్మణ రేఖ