ఇంటర్వ్యూ సంభాషణ

హక్కుల భావజాలాన్ని హిందుత్వ అంగీకరించదు

1. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ దాడులను హక్కుల నాయకుడిగా ఎలా చూస్తున్నారు? వామపక్ష భావాలుగల మేధావుల పైన కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్న బిజెపి రాజ్యాంగ సూత్రాలకు దూరంగా వెళ్లిపోయింది. ప్రజాస్వామ్య ప్రాతిపదికన పరిపాలనను తిరస్కరించి ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలపరంగా పరిపాలన సాగించాలనుకోవడం సమస్యకు మూలం. పరిపాలన పరంగా భారత రాజ్యాంగానికి, హిందుత్వ భావజాలానికి మధ్య వున్న తేడాను బిజెపి చెరిపివేసింది. దీని వల్ల సమాజం చాలా నష్టపోతున్నది. తనకు నచ్చని భావజాలంతో వున్న వారిపై దాడులకు దిగుతోంది. మనుషుల విశ్వాసాలను ప్రమాణంగా తీసుకొని వేరు చేస్తుంది. వేరైన వారిని ఏరివేయాలని పరితపిస్తోంది. అందుకు గాను జాతీయ దర్యాప్తు