(రాజ్యాంగంపై అనేక వైపుల నుంచి చర్చ జరుగుతున్నది. దీనికి అమరుడు ప్రొ. శేషయ్యగారు రాసిన ఈ వ్యాసం తప్పక దోహదం చేస్తుంది. చారిత్రకంగా రాజ్యాంగం రూపొందిన తీరును ఈ వ్యాసంలో ఆయన వివరించారు. మన సామాజిక పరివర్తనలో రాజ్యాంగానికి ఉండవలసిన పాత్రను ఎత్తిపడుతూనే ఆందులో ఎన్నెన్ని వైరుధ్యాలు ఉన్నదీ విశ్లేషించారు. రాజ్యాంగ పరిశోధకుడిగా, న్యాయశాస్త్ర ఆచార్యుడిగా, పౌర హక్కుల ఉద్యమ నాయకుడిగా ఆయన పరిశీలనలు ఇప్పడు జరుగుతున్న చర్చకు కొత్త కోణాలు ఆవిష్కరిస్తాయని పునర్ముద్రిస్తున్నాం.. వసంతమేఘం టీ) ఫ్రెంచి రాజ్యాంగాన్ని పరిశీలించి అందులోని వైరుధ్యాల గురించి మార్క్స్ వివరిస్తూ *ఫ్రెంచి రాజ్యాంగంలోని ప్రధాన వైరుధ్యం : ఒకవైపు కార్మికులకు,