భీమా కోరేగాం కేసును సృష్టించిన హిందుత్వ శక్తులు గత ఐదేళ్లుగా దేశ విదేశాలలో అత్యంత అప్రతిష్ట పాలు కావడంతో ఎన్ఐఏ ప్రస్తుతం మరో కేసుకు రంగం సిద్ధం చేస్తున్నది. భీమా కోరేగాం కేసులో అసలు నేరస్థులను పక్కన పెట్టి ఈ దేశంలోని లౌకిక, ప్రగతిశీల, ప్రజాస్వామిక, దేశభక్త శక్తులను (కళాకారులు, రచయితలు, వకీళ్లు, పాత్రికేయులు, ప్రొఫెసర్లు, ఆదివాసీ శ్రేయోభిలాషులు, సామాజిక కార్యకర్తలు మున్నగువారు) కక్ష పూరితంగా కటకటాల వెనుకకు నెట్టిన హిందుత్వ శక్తుల కౌటిల్యం గతంలో ఏ కేసులోనూ కానంత నగ్నంగా వెల్లడైంది. భీమా కోరేగాం కేసు అనేక మలుపులు, మెలికలు తిరిగి హిందుత్వ శక్తుల థింక్ టాంకుల