వ్యాసాలు

విప్లవ సాంస్కృతికోద్యమం – గద్దర్

జననాట్యమండలి నిర్దిష్ట విప్లవోద్యమ నిర్మాణ సాంస్కృతిక సంస్థ.  నక్సల్బరీ పంథాను రచించిన చారు మజుందర్ నాయకత్వాన్ని స్వీకరించిన సిపిఐ (ఎంఎల్) పార్టీ ఆట-మాట-పాట అది. ఆ విప్లవ పంథాను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అనుభవంతో శ్రీకాకుళం సెట్‌బ్యాక్ తర్వాత ఆచరణలో పెట్టాలనుకున్నపుడు కొండపల్లి సీతారామయ్య నాయకత్వం అవిభక్త కమ్యూనిస్టు పార్టీ సాంస్కృతిక సంస్థగా డాక్టర్ రాజారావు నాయకత్వంలో ఏర్పడిన ప్రజానాట్యమండలి అనుభవాల వెలుగులో జననాట్యమండలిని రూపొందించింది. అయితే దీనికి ఇతర ప్రజాసంఘాల వంటి కార్యనిర్వాహక, కార్యవర్గ నిర్మాణం లేదు. 1986లో హైదరాబాదులో రాంనగర్‌లో అప్పటి పీపుల్స్ వారి కార్యదర్శి శ్యాం (నల్లా ఆదిరెడ్డి) అరెస్టయినపుడు పెట్టిన రాంనగర్
నివాళి

‘ఇప్పుడు కావల్సిన మనిషి’ జహీర్ భాయి

 జహీర్ భాయి (జహీర్ అలీ ఖాన్) విషాదకర ఆకస్మిక మరణంతో దేశం ఒక ఉత్తమమైన, ప్రజాస్వామికవాదిని కోల్పోయింది. ముస్లిం మైనారిటీలకు దేశంలో ప్రజాస్వామ్య ఆవరణ (స్పేస్) పూర్తిగా మృగ్యమవుతున్న కాలంలో, ఆత్మ రక్షణ కోసం వాళ్లు కూడా మతవిశ్వాసాన్నే కవచంగానూ, ఆయుధంగానూ ఎంచుకోవాల్సిన స్థితి ఏర్పడిన కాలంలో హైదరాబాదులోని పాత నగరంలో ఒక ప్రజాస్వామిక ద్వీపంలా జహీర్ అలీ ఖాన్ ఒక కొవ్వొత్తి వెలిగించుకొని లౌకిక ప్రజాస్వామ్య భావజాలం గల మనుషుల్లోకి, నిర్మాణాల్లోకి తన ప్రయాణం మొదలుపెట్టాడు. చార్మినార్ నుంచి, సాలార్‌జంగ్ మ్యూజియం నుంచి ఇమ్లీబన్ బస్‌స్టాండ్‌కు వచ్చే తోవలో అబీద్ అలీ ఖాన్ మెమోరియల్ కంటి వైద్యశాలను
సంపాదకీయం

మణిపూర్ మారణకాండ మాటున

‘జబ్బు పడిన కాదు జబ్బ చరిచిన ఏడుగురు అక్క చెల్లెళ్ళను చూడడానికి వెళ్లి వచ్చాను’ అని రాసాడు శివసాగర్ విరసం ఏర్పడిన పదేళ్ల సందర్భంగా వేసిన కవితా సంకలనానికి ‘పది వసంతాలు’ పేరుతో 1980 అక్టోబర్‌లో. ఆ ఏడుగురు అక్క చెల్లెళ్ళు ఎవరో కాదు ఈశాన్య రాష్ట్రాలు. సిపిఐ (ఎంఎల్) (పీపుల్స్ వార్) ఏర్పడినాక తన ప్రజా యుద్ధ వ్యూహంలో దండకారణ్య పర్‌స్పెక్టివ్‌తో నక్సల్బరీ నాటి నుంచే తనకున్న ఈశాన్య రాష్ట్రాల, కశ్మీరు స్వయం నిర్ణయ హక్కును విడిపోయే హక్కుగా కూడా గుర్తిస్తున్న పార్టీగా ఏం చేయవలసి ఉంటుందో, ఏం చేయగలదో మళ్లీ తాజాగా ఒక అవగాహనకు వచ్చి
వ్యాసాలు

కామ్రేడ్ ఎల్‌ఎస్‌ఎన్ స్నేహం శరచ్చంద్రిక

కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి అమరుడైన 21 డిసెంబర్ రోజే 53 సంవత్సరాల తర్వాత కామ్రేడ్ ఎల్.ఎస్.ఎన్ మూర్తి అమరుడు కావడం యాదృచ్ఛికమే కావచ్చు. కాకపోతే ముప్పై ఏళ్ళు నిండకుండానే శ్రీకాకుళ విప్లవంలో ఎన్‌కౌంటర్ అయిన సుబ్బారావు పాణిగ్రాహి పూజారిగా పనిచేస్తూ కమ్యూనిస్టు భావాలతో ప్రభావితుడు అయ్యాడు. గుడికి వచ్చే వారికి, గ్రామ ప్రజలకు ఆ భావాలు ప్రచారం చేసేవాడు. ఇక ఎల్.ఎస్.ఎన్ పూర్వీకులది కాంగ్రెస్‌లోనే ‘అతివాదం’గా భావించబడిన రాజకీయ చరిత్ర. గుంటూరులో అన్న లక్కవరం రాధాకృష్ణమూర్తి యింట్లో ఉండి చదువుకున్న రోజుల్లో ఆయన ఇంగ్లిషు లెక్చరర్ అయిన అన్న నుంచి, ఆ ఇంట్లో ఉండి స్ఫూర్తిశ్రీ పేరుతో భారతి
వ్యాసాలు

‘స్టాలిన్‌యుగం’లో ఇండియా

రష్యాలో వానబడితే మనదేశంలో కమ్యూనిస్టులు గొడుగుపడతారు అని 1955కు ముందు ఇండియాలో కమ్యూనిస్టు వ్యతిరేకులు వ్యాఖ్యానించే వాళ్లు. నిజానికి బోల్షివిక్‌ విప్లవం తర్వాత ఆరేళ్లకు గానీ ఇక్కడ కమ్యూనిస్టుపార్టీ పుట్టలేదు. లెనిన్‌ బతికుండగానే ఇండియా నుంచి ఎం.ఎన్‌.రాయ్‌ ఆసియా ఖండంలోనే మొదటివాడుగా ఇక్కడికి కమ్యూనిస్టుపార్టీని తెచ్చాడుగానీ ఆయనే అందులో నిలవక ఆ తర్వాత రాడికల్‌ హ్యూమనిస్ట్‌పార్టీ పెట్టి వేరుపడ్డాడు.  అయితే బ్రిటిష్‌ సామ్రాజ్యవాద వలసపాలన దమనకాండ భరించచలేని ప్రజలు, ముఖ్యంగా జలియన్‌వాలాబాగ్‌ ఉదంతం ఇంచుమించు అదేకాలంలో జరిగింది గనుక బోల్షివిక్‌ విప్లవంతో చాల ఉత్తేజితులయ్యారు. లెనిన్‌ను పీడితప్రజల, శ్రామికవర్గాల విముక్తిప్రదాతగా చూడసాగారు. అమెరికాలో ఉన్న సిఖ్కు మేధావులు కొందరు
కవిత్వం

అడవి –  రోడ్డు

అడవిమీద రోడ్డు దండయాత్ర చేస్తున్నది అడవిని రోడ్డు ఆక్రమించుకుంటున్నది మట్టిని, చెట్టును, ఆకును, పుప్వును, నీటిని పుట్టను, పిట్టను, గుహను, గూటిని గుట్టను, లోయను తొలిచేస్తూ రోడ్డు పొక్లెయినర్‌లా వస్తున్నది కొండచిలువతో కూడ పోల్చలేము కొండచిలువ నుంచి పిల్లల్ని, వృద్ధుల్ని, తనను రక్షించుకోవడం అనాదిగా ఆదివాసీకి తెలుసు రోడ్డు బాటల్ని రద్దుచేస్తూ వస్తున్నది మనిషి పాదాలకింద మట్టిని డాంబర్‌తో సిమెంటుతో కప్పేస్తూ వస్తున్నది ఇసుకదాహంతో వస్తున్నది ఇనుము దాహంతో వస్తున్నది ఇంధనం దాహంతో వస్తున్నది ఖనిజదాహంతో వస్తున్నది ఎదుటివాని దప్పిక ఏమిటో ఆదివాసీకి తెలుసు పసిపాపకు చన్నుకుడిపిన అడవితల్లికి తెలుసు ఆవుపాలు దూడకోసమే అనుకునే ఆదివాసికి తెలుసు కడుపుకి
సంపాదకీయం

మావోయిస్టురహిత భారత్‌‍లో 2024 ఎన్నికలు

త్రిపుర ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్షా, 2024 లోక్సభ ఎన్నికలు మావోయిస్టురహిత భారత్లో జరుగుతాయని జోస్యం చెప్పాడు. ఎన్నికలు ఎప్పుడూ పాలకవర్గపార్టీ (ల) హితం కొరకే జరుగుతాయి గానీ మావోయిస్టుపార్టీకో మరో విప్లవ పార్టీకో హితం కూర్చడానికి జరగవు. పైగా మావోయిస్టు పార్టీ తన పూర్వరూపాల్లో కూడ అంటే 1969 ఏప్రిల్ 22న ఏర్పడినప్పటి నుంచి ఎన్నికల బహిష్కరణ పిలుపు ఇచ్చి ప్రజలను ఈ బూటకపు పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికలకు దూరంగా ఉండమనే చెప్తున్నది. ఆ విషయంలో ఎంతవరకు ప్రజల్ని ఎన్నికల భ్రమ నుంచి దూరం చేయగలిగిందనేది ఎన్నికలలో పోలయిన ఓట్లతో నిర్ణయించే గణాంకపద్ధతి కాదు.
వ్యాసాలు

ఫాసిస్టు యుద్ధాన్ని ప్రజాయుద్ధంగా మార్చిన స్టాలిన్‌

దేశభక్తి గల ఒక ఎన్‌ఆర్‌ఐ బంధువు స్టాలిన్‌ గురించి సులభంగా అర్థమయ్యే పద్ధతిలో నానుంచి జవాబు ఆశించాడు. స్టాలిన్‌ నాయకత్వమూ, రెండవ ప్రపంచయుద్ధంలో రెండుకోట్లమంది రష్యన్‌ ప్రజల ప్రాణత్యాగాలే లేకపోతే పాశ్చాత్యదేశాల  సోకాల్డ్‌  పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఫాసిజం నుంచి బతికి బయటపడేది కాదని జవాబిచ్చాను. స్టాలిన్‌ నాయకత్వం అన్నపుడు - అందులో లెనిన్‌ నాయకత్వంలోని బోల్షివిక్‌పార్టీ మొదటి ప్రపంచ యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చి శ్రామికవర్గ విప్లవాన్ని విజయవంతం చేసిన చరిత్ర ఉన్నది. ఆ విప్లవ విజయకాలం నుంచి (అక్టోబర్‌ 1917) విప్లవంలోనూ, ఆ తర్వాతకాలంలో లెనిన్‌ నాయకత్వంలో 1923 దాకా సోషలిస్టు నిర్మాణాలకు వచ్చిన అవరోధాలను పరిష్కరించిన చరిత్ర
సాహిత్యం కొత్త పుస్తకం

విప్లవాన్వేషణలో…..

ఇది విప్లవకారుడు రాంప్రసాద్ బిస్మిల్ ఆత్మకథ. 1925 ఆగస్టు 9న అంటే ఇప్పటికి తొంభై ఏడేళ్ల క్రితం కాకోరీ రైలునాపి ఖజానా కొల్లగొట్టిన విప్లవాకారుల బృంద నాయకుడు రాంప్రసాద్ బిస్మిల్ ఆత్మకథ. కాకోరీ కుట్ర కేసుగా ప్రసిద్ధమైన నేరారోపణలో శిక్షలు పడిన విప్లవకారుల కథ. వీరిలో రాంప్రసాద్ ‘బిస్మిల్’, అష్ఫఖుల్లా ఖాన్ ‘వారాసీ’, రాజేంద్రనాథ్ లాహిరి స్వయంగా ఖజానా కొల్లగొట్టిన ఘటనలో పాల్గొన్నవారు. వీరిలో రాజేంద్రనాథ్ లాహిరిని అప్పటి సంయుక్త రాష్ట్రాల (ఇప్పటి ఉత్తరప్రదేశ్) గోండా జైలులో నిర్ణీతమైన తేదీకి రెండు రోజుల ముందే 1927 డిసెంబర్ 17న ఉరి తీశారు. ఎందుకంటే అతన్ని నిర్ణీత తేదీకి ముందే