వ్యాసాలు

పోలవరంలో మునిగిపోతున్న ఆదివాసులు

తెలంగాణ తొలి, మలివిడత ఉద్యమకారుల ఆధ్వర్యంలో 'భూ హక్కుల పరిరక్షణ ఉద్యమకారుల సమాఖ్య' ఏర్పడింది. హక్కుల కార్యకర్తలు, కవులు, రచయితలు, న్యాయవాదులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు ఈ సమాఖ్యలో భాగస్వాములుగా ఉన్నారు. తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం, నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయాలను ప్రశ్నించడం ఈ ఐక్య సంఘటన కమిటి ప్రధాన లక్ష్యం. తెలంగాణ ఏర్పడ్డాక ఏడు మండలాలను అక్రమంగా ఆంధ్రాలో కలిపి తీరని అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంతో తెలంగాణ, ఒరిస్సా, చత్తీస్‌గఢ్‌లో లక్షలాది ఎకరాల అటవీ ప్రాంతం ముంపుకు గురవుతుంది. లక్షల మంది నిర్వాసితులు అవుతున్నారు. కూనవరం, బూర్ఘంపాడు, వరా రామచంద్రాపురం