వ్యాసాలు

బిల్కిస్ బానో తీర్పు: ఎక్కువ  ఉపశమనం, కొంచెం భరోసా

అత్యంత దారుణమైన వార్తలు, భయానక, దిగ్భ్రాంతికరమైన న్యాయ నిర్ణయాలు, అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తుల వ్యక్తిగత, అధికారిక ప్రవర్తనకు సంబంధించిన ఘటనలు, ప్రమాదాల తుఫాను మధ్య జనవరి 8, సోమవారం నాడు సుప్రీం కోర్టు నిర్ణయం చాలా వరకు ఉపశమనం కలిగించింది. కొంత వరకు భరోసానిస్తుంది. జస్టిస్ బిబి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ 75వ స్వాతంత్య్ర  వార్షికోత్సవం సందర్భంగా మోడీ కేంద్ర , గుజరాత్ ప్రభుత్వాలు శాంతిభద్రతలతోనే కాకుండా మానవీయతకు చేసిన అత్యంత ఘోరమైన దుష్ప్రవర్తనను రద్దు చేసింది. 2002లో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుజరాత్ మారణకాండ సందర్భంగా బిల్కిస్